ఫిల్మీ మ్యాజిషియన్స్ పతాకం పై సుకన్య సమర్పణలో హీరో సాయి కుమార్ యముడిగా టి. హర్ష దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం యమ డ్రామా. ఈ చిత్రానికి టి. రామకృష్ణ రావు నిర్మాత. యముడి కథలతో ఎప్పుడు సినిమాలు తెరకెక్కినా వాటికీ మంచి క్రేజ్ ఉంటుంది. యముడి కథలతో వచ్చిన యమ గోల, యముడికి మొగుడు, యమ దొంగ, యమ లీల తదితర చిత్రాలు విజయాన్ని అందుకోవడంతో.. లవ్ ఎమోషనల్ డ్రామాతో ఈ యమ డ్రామాని దర్శకుడు ప్రేక్షకులు మెచ్చేలా తెరకెక్కించారు. ప్రస్తుతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ యమ డ్రామా చిత్రం ట్రైలర్ ని ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి చేతుల మీద లాంచ్ చేసింది చిత్ర బృందం.