బిగ్ బాస్ 4 లో సుజాత చాలా అతి చేస్తుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. మొన్నామధ్య కెమెరా ముందు అప్పుడే ఏడుస్తూ, అప్పుడే నవ్వుతూ పిచ్చి పిచ్చిగా ప్రవర్తించింది. ఫ్యాషన్ షో అయిపోయాక అవినాష్ అద్దం టాస్క్‌లో అందరిపై కామెడీ చేస్తే నవ్వింది, కానీ ఆమెపై జోకులు పేలిస్తే మాత్రం సీరియస్‌గా తీసుకుంది. ఆ మధ్య అభిజిత్ చెల్లి అన్నందుకు కూడా తెగ ఫీలైపోయింది. ఎవరితో సరిగా కలవట్లేదన్న కారణంతో కుమార్ సాయిని నామినేట్ చేసి తిరిగి ఓ టాస్క్‌లో తన అవసరం కోసం మళ్లీ అతడి దగ్గరకే వెళ్లి సాయం కోరడం విడ్డూరం. వీటన్నింటినీ గమనిస్తున్న ప్రేక్షకులు ఆమె నామినేషన్ జోన్లోకి వచ్చే సమయం కోసం వేయి కళ్లతో ఎదురు చూశారు. ఒక్కసారి నామినేట్ అయితే చాలు, ఇంటి నుంచి బయటకు పంపించేందుకు సిద్ధంగా ఉన్నారు.