ప్రభాస్ ఫ్యాన్స్ లో టెన్షన్ మొదలయ్యింది. ఎందుకంటే అక్టోబర్ 22న ‘ఆర్.ఆర్.ఆర్’ నుండీ భీమ్ టీజర్ రాబోతుందని ఇప్పటికే ఆ చిత్రం యూనిట్ సభ్యులు అధికారికంగా ప్రకటించారు. అంతేకాదు ‘కె.జి.ఎఫ్ చాప్టర్2’ టీజర్ కూడా అదే టైంలో విడుదల కాబోతుందని కూడా తాజా సమాచారం.నిజానికి ‘కె.జి.ఎఫ్ చాప్టర్2’ చిత్రాన్ని అక్టోబర్ 23నే విడుదల చెయ్యాలి అనుకున్నారు.