చిరుకి కూడా వినాయక్ పై చాలా నమ్మకం ఉంది. తన రీ-ఎంట్రీ చిత్రాన్ని డైరెక్ట్ చేసే బాధ్యతను చిరు.. వినాయక్ కే అప్పగించారంటే ఆ విషయాన్ని అర్ధం చేసుకోవచ్చు. అయితే ఓ విషయంలో మాత్రం వినాయక్ ను చిరు నిరాశపరిచారట. వివరాల్లోకి వెళితే.. ఈరోజు వినాయక్ పుట్టినరోజు. కాబట్టి ‘లూసిఫర్’ రీమేక్ కు సంబంధించిన అనౌన్స్మెంట్ ఇస్తారేమో అని వినాయక్ ఆశపడ్డారట. ఆయనే కాదు .. వినాయక్ అభిమానులు కూడా అదే కోరుకున్నారట. అయితే ఆ ప్రాజెక్టుకి సంబంధించి ఎటువంటి అనౌన్స్మెంట్ రాలేదు.