తెలుగులో ఇండస్ట్రీ హిట్ అయిన మూడు సినిమాలను అమితాబ్ రిజెక్ట్ చేశారట. అవేంటో తెలుసా.. ఒకటి మహేష్ నటించిన ‘పోకిరి’ కాగా మరొకటి ‘బాహుబలి'(సిరీస్). పూరిజగన్నాథ్ ‘పోకిరి’ సినిమాలో ఓ పాత్ర కోసం అమితాబ్ ను సంప్రదించారట. కానీ ఆయన డేట్స్ ఖాళీ లేక చెయ్యలేను అన్నారట.  ఆ పాత్ర ఏంటన్నది మాత్రం రివీల్ కాలేదు. ఇక ‘బాహుబలి'(సిరీస్)లో కూడా ఓ ప్రాముఖ్యత కలిగిన పాత్ర కోసం రాజమౌళి.. అమితాబ్ ను సంప్రదించారట.దానికి కూడా అమితాబ్ ఒప్పుకోలేదని తెలుస్తుంది. ఆయన రిజెక్ట్ చేసిన ‘పోకిరి’ ‘బాహుబలి ది బిగినింగ్’ ‘బాహుబలి ది కన్క్లూజన్’ చిత్రాలు ఇండస్ట్రీ హిట్లు అయ్యాయి.