రెబెల్ స్టార్ ప్రభాస్ సినిమాలో బాలీవుడ్ బిగ్ బాస్ అమితాబ్ బచ్చన్ది గెస్ట్ రోల్ కాదనీ, ఫుల్ లెంగ్త్ క్యారెక్టర్లో కనిపిస్తారని డైరెక్టర్ నాగ్ అశ్విన్ చెప్పారు. సినిమాలో టర్నింగ్ పాయింట్స్, ఇంపార్టెంట్ సీన్లు అన్నిటిలో బచ్చన్ సాబ్ కనిపిస్తారని విశ్వసనీయ వర్గాలు చెప్తున్నాయి. అందుకని, సినిమాకి ఆయన ఎక్కువ డేట్స్ కేటాయించారట. ఆల్రెడీ ఆయన షెడ్యూల్, కాల్ షీట్లు కన్ఫర్మ్ చేశారు.  జనవరిలో సినిమా షూటింగ్ స్టార్ట్ చెయ్యడానికి ప్రొడక్షన్ హౌస్ వైజయంతి మూవీస్ రెడీ అవుతున్నది. తొలుత ప్రభాస్, హీరోయిన్ దీపికా పదుకొనె మీద సన్నివేశాలు తెరకెక్కించాలని ప్లాన్ చేశారు. మధ్య మధ్యలో కొంచెం గ్యాప్ ఇస్తూ రెండు మూడు నెలలు షూట్ చెయ్యనున్నారు. ఏప్రిల్ నుండి అమితాబ్ బచ్చన్ షూటింగ్ లో జాయిన్ అవ్వనున్నారు. ఈ సినిమాకి ఆయన 40 డేస్ కేటాయించారు. ఏప్రిల్ లో అమితాబ్ వచ్చాక హీరో హీరోయిన్లు, ఇతర ఆర్టిస్టులతో కాంబినేషన్ సీన్లు తియ్యాలని డిసైడ్ అయ్యారు.