వర్మ తనకు దేవుడితో సమానమని శంకర్ అన్నాడు. ‘‘లాక్డౌన్లో నాకు నాలుగు పనులు (సినిమాలు) ఇచ్చిన మహానుభావుడు రామ్ గోపాల్ వర్మ. ఇండస్ట్రీలో 24 క్రాఫ్ట్స్‌కి భోజనం పెట్టాడు. ఈ ట్రైలర్లో నాకు సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ అని డైలాగ్ ఉంది. నా లైఫ్‌లో నాకు సోర్స్ ఆఫ్ ఇన్స్పిరేషన్ వర్మే. నాకు సోర్స్ ఆఫ్ గాడ్’’ అని ‘షకలక’ శంకర్ చెప్పాడు. సినిమాకు కర్త, కర్మ, క్రియ అన్నీ డైరెక్టర్ కమ్ ప్రొడ్యూసర్ జర్నలిస్ట్ ప్రభు అన్నాడు. మధ్యలో నటుడిగా తాను నలిగిపోయా అని చెప్పుకొచ్చాడు.