బాలీవుడ్లో సూపర్ హిట్ అయిన ‘అంధాదున్’ ను తమిళంలో కూడా రీమేక్ చెయ్యబోతున్నారట. ఈ చిత్రం రీమేక్ రైట్స్ ను ప్రశాంత్ తండ్రి.. అలాగే ప్రముఖ నిర్మాత అయిన తియగరాజన్ కొనుగోలు చేశారట. అక్కడ టబు నటించిన పాత్రకు తమిళంలో ఐశ్వర్యరాయ్‌ని ఎంపిక చేసుకోవాలనే ఉద్దేశంతో ఆమెను సంప్రదించారట తియగరాజన్.