‘బృందావనం’ చిత్రానికి ఫస్ట్ ఛాయిస్ ఎన్టీఆర్ కాదట. ఓ స్టార్ హీరో రిజెక్ట్ చేస్తే.. అది ఎన్టీఆర్ వద్దకు వచ్చినట్టు తెలుస్తుంది. ఆ స్టార్ హీరో మరెవరో కాదు మన ప్రభాస్. దర్శకుడు వంశీ పైడిపల్లి మొదట ప్రభాస్ తో ‘మున్నా’ అనే చిత్రాన్ని తెరకెక్కించాడు.ఆ చిత్రానికి కూడా దిల్ రాజే నిర్మాత. అయితే ఆశించిన స్థాయిలో ఆ చిత్రం విజయం సాధించలేదు. ‘ప్రభాస్ నన్ను ఎంతో నమ్మి నాకు ఛాన్స్ ఇచ్చాడు. కానీ అతనికి హిట్ ఇవ్వలేకపోయాను’ అని వంశీ గిల్టీగా ఫీలయ్యాడట.