ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ రామ్ చరణ్ టీజర్ కి హైలైట్ గా నిలిచింది. ఇప్పుడు ఎన్టీఆర్ పాత్రకి సంబంధించిన టీజర్ ని విడుదల చేయనున్నారు. అక్టోబర్ 22న ఈ టీజర్ ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనికోసం కొద్దిరోజుల క్రితం ప్రత్యేకంగా షూటింగ్ మొదలుపెట్టారు. ఇంతకీ ఈ వీడియో ఎలా వుండబోతుందనే దానిపై ఆసక్తికర విషయాలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ వీడియోలో ఎన్టీఆర్ ని పలు గెటప్పుల్లో చూపిస్తారని తెలుస్తోంది. ఓ మామూలు స్థాయి వ్యక్తి నుండి ఉద్యమకారుడైన కొమరం భీమ్ గా మరీనా వైనాన్ని రకరకాల గెటప్పుల్లో చూపిస్తారని తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ కంటే కూడా ఎన్టీఆర్ పాత్రే హైలైట్ అవుతుందని తాజా సమాచారం.