ఇప్పుడు సీజన్ – 4 కోసం కూడా ఈ దసరాకి విజయ్ దేవరకొండ హౌస్ లోకి రాబోతున్నాడని చెప్తున్నారు. బిగ్ బాస్ టీమ్ విజయ్ డేట్ ని ఇప్పటికే బ్లాక్ చేశారని అంటున్నారు. అయితే ఇప్పుడు విజయ్ దేవరకొండ – నాగార్జున ఎపిసోడ్ లో వస్తాడా.. లేదా డైరెక్ట్ గా హౌస్ లోకి ఎంట్రీ ఇస్తాడా అనేది ఆసక్తికరం. అంతేకాదు, బిగ్ బాస్ సీజన్ లో ఈసారి నాగార్జున కొన్ని ఎపిసోడ్స్ దూరంగా ఉంటాడని, అప్పుడు విజయ్ దేవరకొండ యాంకరింగ్ కూడా చేసే అవకాశం ఉందని కూడా టాక్స్ వినిపిస్తున్నాయి.