రాజమౌళి అప్పుడొక ఇంటర్వ్యూ లో ఆర్ ఆర్ ఆర్ సినిమాలో హీరోల పాత్రలు ఎలాగుంటాయి అన్న ప్రశ్నకి ఈ విధంగా సమాధానం ఇచ్చారు. "నేను డూప్లికేట్ హీరోస్ నే రియల్ హీరోస్ లాగా చూపిస్తాను.. ఇక కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజులు రియల్ హీరోస్ వాళ్ళని ఇంకేలాగ చూపిస్తానో మీ ఊహలకే వదిలేస్తున్న" అని చెప్పాడు. మొత్తానికి తను చెప్పినట్టే ఊహలకు తగ్గ రీతిలో ఈ ఇద్దరి హీరోస్ ని చూపించారంటూ నెటిజన్స్ రాజమౌళిని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.