ప్రముఖ పారిశ్రామిక వేత్త గౌతమ్ కిచ్లును ఈ నెల 30న కాజల్ వివాహం చేసుకోబోతున్నారు. చాలా కాలంగా ప్రేమలో ఉన్న ఈ జంట ఎట్టకేలకు పెళ్లి బంధంతో ఒక్కటి కానున్నారు. ఇటీవలే ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది కాజల్. కరోనా నేపథ్యంలో ఈ పెళ్లిని సింపుల్గా ఇంట్లోనే చేసుకుంటున్నారట. ఇరు వర్గాల కుటుంబ సభ్యులు, అత్యంత సన్నిహితులను మాత్రమే ఈ పెళ్లికి ఆహ్వానించనున్నారు.