గతంలో కోడి రామకృష్ణ డైరెక్షన్లో బాలయ్య హీరోగా ‘విక్రమసింహ భూపతి’ అనే చిత్రం మొదలయ్యింది. నందమూరి బాలకృష్ణ, కోడి రామకృష్ణ కాంబినేషన్లో ఎనిమిదవ చిత్రంగా ప్రారంభమైన ’విక్రమసింహ భూపతి’.. 80శాతం షూటింగ్ ను పూర్తి చేసుకుంది.అయితే ఈ చిత్రం నిర్మాత అయిన ఎస్.గోపాల్ రెడ్డిగారి మరణంతో మధ్యలో ఆగిపోయింది. ఈ చిత్రంలో బాలయ్య సరసన రోజా, పూజా బాత్రా హీరోయిన్లుగా నటించారు. ఇప్పుడు ఈ చిత్రాన్ని ఓటిటిలో విడుదల చెయ్యాలని ప్లాన్ చేస్తున్నారని వార్తలు వస్తున్నాయి.