ఇప్పటికే పవన్ పుట్టినరోజు నాడు హరీష్ శంకర్ రిలీజ్ చేసిన కాన్సెప్ట్ పోస్టర్ ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ పోస్టర్ చూసిన పవన్.. హరీష్ ని పిలిపించి కథ పూర్తయిందా..? అని అడిగారట. అయితే ప్రస్తుతం హరీష్ దగ్గర ఇంకా పూర్తి కథ రెడీగా లేదు. ‘గబ్బర్ సింగ్’ తరువాత తమ కాంబోలో వస్తోన్న సినిమా కాబట్టి అంచనాలు తారాస్థాయిలో ఉంటాయనే విషయం హరీష్ శంకర్ కి తెలుసు. పైగా ‘డీజే’ సినిమా రిజల్ట్ తో స్టార్ హీరోలెవరూ కూడా హరీష్ కి ఛాన్స్ లు ఇవ్వడం లేదు. కాబట్టి ఈ సినిమాతో తన సత్తా చాటాల్సివుంది.