రీసంట్ గా రిలీజ్ చేసిన ప్రోమోలో అభిజిత్ పైన అమ్మరాజశేకర్ ఫైర్ అవుతుంటే, అభిజిత్ కూడా మాటకి మాట చెప్పి రచ్చ రచ్చ చేశాడు. బాగా ఆవేశపడ్డాడు.  నువ్వెంత అంటే నువ్వెంత అనేలా ఈ ప్రోమో చూస్తుంటే నామినేషన్స్ తో హౌస్ హీటెక్కినట్లుగానే కనిపిస్తోంది. ముఖ్యంగా ఈ గొడవ చూస్తుంటే అభిజిత్ నోయల్ విషయంపై అమ్మరాజశేఖర్ ని నామినేట్ చేసినట్లుగా తెలుస్తోంది. దీన్ని డిపెండ్ చేస్కోవడానికి అమ్మరాజశేఖర్ మాస్టర్ ఆవేశంగా అభిజిత్ పై మాటలు విసిరాడు. అభిజిత్ కి హౌస్ లో కూల్ కంటెన్స్టెంట్ గా పేరుంది. అమ్మా రాజశేఖర్ ని మిస్టర్ గజిబిజి అని నెటిజన్లు ట్రోల్ చేస్తుంటారు. ఎప్పుడూ కూల్ గా ఇష్యూని డీల్ చేసే అభిజిత్ అమ్మరాజశేఖర్ పై ఫైర్ అయ్యాడు. మరి వీరిద్దరి మధ్యలో గొడవ ఎంత దూరం వెళ్తుంది అనేది చూడాలి.