పుష్ప’ మూవీలో అల్లు అర్జున్ లారీ డ్రైవర్ గా.. గంధపు చక్కలు స్మగ్లింగ్ చేసే వ్యక్తిగా కనిపించబోతున్నాడు. ఇక ఈ చిత్రంలో విలన్ గా మొదట తమిళ్ స్టార్ హీరో విజయ్ సేతుపతిని అనుకున్నారు. కానీ కొన్ని కారణాల వల్ల ఆయన ఈ ప్రాజెక్టు నుండీ తప్పుకున్నాడు. అప్పటి నుండీ ఆ పాత్రకోసం ఎవరిని ఎంపిక చేసుకోవాలా అనే డైలమాలో పడ్డారు చిత్ర యూనిట్ సభ్యులు.