చిరు , ఆర్జీవీ సినిమా పై వర్మ అంత మాట అనేశాడెంటి.. 20ఏళ్ల క్రితమే ఆర్జీవీ ఈ ప్రాజెక్టు పట్టాలెక్కించేందుకు ప్రయత్నించాడు. చిరుతో సినిమా చేసేందుకు ఓ కథను సిద్ధం చేశాడు. అశ్వనీదత్ నిర్మాతగా, చిరంజీవి, టబు జంటగా ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. సినిమా పేరు ‘వినాలని ఉంది’. దాదాపు 20శాతం షూటింగ్ పూర్తయ్యాక చిరుకు స్క్రిప్టుపై సందేహం వచ్చి సినిమాను ఆపేశారు.. వర్మను కథను మార్చమని చిరు కోరగా.. ముక్కు సూటి మనిషి వర్మ నో అని చెప్పేశాడు.. దీంతో సినిమా ఆగిపోయింది.