సూపర్ స్టార్ మహేష్ బాబుతో సరిలేరు నీకెవ్వరూ సినిమా తీసి ఇండస్ట్రీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు....ఇప్పుడు ఒక సినిమా కి నిర్మాతగా మారాడు. ఆ సినిమా పేరు ‘గాలి సంపత్’. సీనియర్ నటుడు రాజేంద్రప్రసాద్, శ్రీవిష్ణు ప్రధాన పాత్రలు పోషిస్తున్న సినిమా ఇది. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ ని లాంచ్ చేశారు. సైన్ స్క్రీన్స్ అధినేతలు సాహు గారపాటి, హరీష్ పెద్దిలతో కలిసి ఎస్.కృష్ణ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ ముగ్గురూ అనీల్ రావిపూడికి మంచి స్నేహితులు. ఈ క్రమంలో అనీల్ కూడా ఈ ప్రాజెక్ట్ లో నిర్మాణ భాగస్వామిగా మారారు.