సినీ నటుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సైతం సత్యప్రభకు నివాళులర్పించడానికి శుక్రవారం బెంగళూరు వెళ్లారు. ఆయన హాస్పిటల్లో నివాళులర్పించి బయటకు వస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. హాస్పిటల్ నుంచి బయటికి వస్తోన్న రామ్ చరణ్‌ను తమ ఫోన్లలో బంధించడానికి అక్కడున్న చాలా మంది అభిమానులు ప్రయత్నించారు. వారి మధ్య నుంచి చరణ్ కారు వద్దకు వెళ్లారు.. అప్పుడు క్లిక్ కనిపించిన వీడియో సోషల్ మీడియా లో విపరీతంగా చక్కర్లు కొడుతోంది.