ప్రదీప్ కి ఓ గుర్తింపు వచ్చాక మొదటిసారి మెగాస్టార్ చిరంజీవిని కలవడానికి వెళ్లగా.. ఆయన తనను పేరుపెట్టి పిలుస్తూ ఎంతో ఆప్యాయత చూపించారని తెలిపాడు ప్రదీప్. ''మీ వాయిస్ నాకు చాలా ఇష్టం. మీరు పలికే తెలుగు పదాల ఉచ్చారణ నాకెంతో నచ్చుతుంది'' అని ఆయన ప్రశంసించడం ఎప్పటికీ మరచిపోలేనని అన్నాడు. చిరంజీవి తనతో మాట్లాడుతుంటే అలాగే నిల్చుండిపోయానని, ఆ సమయంలో కూర్చోండి అంటూ మెగాస్టార్ అనడం.. ఆ క్షణాలు మరవరానివాని ప్రదీప్ పేర్కొన్నాడు.