కేసీఆర్ పై ప్రశంసలు కురిపిస్తున్న సినీ తారలు.. చిన్న సినిమాలకి రాష్ట్ర జీఎస్టీ రీఎంబర్స్మెంట్, రాష్ట్ర వ్యాప్తంగా సినిమా థియేటర్లకు విద్యుత్ కనీస డిమాండ్ చార్జీల రద్దు, రాష్ట్రంలోని అన్ని సినిమా థియేటర్స్లో షోలను పెంచుకునేందుకు అనుమతి, మహారాష్ట్ర, కర్నాటక, ఢిల్లీలలో ఉన్న విధంగా టిక్కెట్ల ధరలను సవరించుకునే వెసులుబాటు లాంటి చర్యలు ఈ కష్ట సమయంలో ఇండస్ట్రీకి, దానిపై ఆధారపడిన లక్షలాది కుటుంబాలకు ఎంతో తోడ్పాటుగా ఉంటాయి.. మీరు ఇచ్చిన స్ఫూర్తి తోనే సినీ పరిశ్రమ అభివృద్ధి చెందుతుందని చిరు ట్వీట్ చేశారు.. ప్రస్తుతం ఆ ట్వీట్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది..