సూపర్ స్టార్ మహేష్ నుండి వస్తున్న సినిమాల్లో కమర్షియల్ ఎలిమెంట్స్‌తో పాటు కొత్త మెసేజ్ ఉంటుంది. భరత్ అనే నేను, మహర్షి, సరిలేరు నీకెవ్వరు చిత్రాలు అలా వచ్చే బాక్సాఫీస్ వద్ద సత్తా చాటాయి. దీంతో సర్కారువారి పాట సినిమా కూడా సందేశాత్మకంగా ఉంటుదని తెలుస్తోంది. తనకు ఎలాంటి కథ కావాలో, అందులో ఎలాంటి ఎలిమెంట్స్ ఉండాలో మహేష్ ముందుగానే చెప్పడంతో, అందుకు తగ్గట్టు పరశురాం స్కిప్ట్‌ను డిజైన్ చేసినట్లు సమాచారం. ఇక ఈ సినిమాకి ఇంటెర్వెల్ సీన్ ఆయువుపట్టులాంటింది.ఈ ఇంటర్వెల్ సీనుతో సినిమా ఓ రేంజ్లో ఉంటుందని మేకర్స్ ఫ్యాన్స్ కి భరోసా ఇస్తున్నారు. దీంతో పరశురాం అండ్ టీమ్ ఎంతో శ్రమించి ఇంటర్వెల్ సీన్స్ డిజైన్ చేశారట. మహేష్ కెరీర్లోనే ది బెస్ట్ ఇటర్వెల్గా నిలిచిన ఒక్కడు, పోకిరి సినిమాలను మించి సర్కారు వారి పాట ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరిపోయేలా ఉంటుందని, థియేటర్లో విజిల్స్‌తో మోత మోగిపోతుందని అంటున్నారు.