కలెక్షన్ కింగ్ డాక్టర్ మోహన్ బాబు హీరోగా నటిస్తోన్న దేశభక్తి కథా చిత్రం ‘సన్ ఆఫ్ ఇండియా’. శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ సంయుక్తంగా నిర్మిస్తోన్న ఈ చిత్రానికి డైమండ్ రత్నబాబు దర్శకత్వం వహిస్తున్నారు. ఇదివరకెన్నడూ కనిపించని అత్యంత పవర్ఫుల్ రోల్లో మోహన్ బాబు నటిస్తోన్న ఈ తరహా కథ కానీ, ఈ జానర్ సినిమా కానీ ఇప్పటివరకూ టాలీవుడ్ చరిత్రలో ఎప్పుడూ రాలేదని చిత్ర బృందం చాలా ధీమాగా గర్వంగా చెబుతోంది.