ఇంటర్వ్యూలో మంచు లక్ష్మి మాట్లాడుతూ ఓ హీరోకు పెళ్లి అయిందని తెలియడంతో ఏడ్చానని చెప్పి ఆశ్చర్యపరిచింది. ఆ హీరో మరెవరో కాదట.. ఆమిర్ ఖాన్ అని, ఆయనకు తాను పెద్ద ఫ్యాన్ అని చెప్పింది. అయితే ఆమిర్ పెళ్లి చేసుకున్నాడని తెలిశాక చాలా బాధ అనిపించిందని చెప్పిన ఈ మంచువారమ్మాయి.. ఆమిర్ ఖాన్ రెండో పెళ్లి చేసుకున్న సమయంలోనూ ఏడ్చేశానని చెప్పడం విశేషం. ముఖ్యంగా ఆమిర్ ఖాన్ సినిమాలను ఎంచుకునే విధానం తనకు బాగా నచ్చుతుందని మంచు లక్ష్మి చెప్పింది.