జనవరి 9న సునీత, రామ్ వీరపనేని వివాహం జరగనున్నట్లు సమాచారం. అయితే..కరోనా నేపథ్యంలో పెళ్లికి కొందరు ప్రముఖులను మాత్రమే ఆహ్మానించనున్నారని టాక్. జనవరి 9న వీరిద్దరి పేరుపై మంచి ముహుర్తం ఉండటంతో...మళ్లీ ఈ ముహుర్తం దాటితే మంచి రోజులు లేకపోవడంతో అదే తేదీని ఫిక్స్ చేసేశారట.. ఇంకో పది రోజుల్లో సునీత ఓ ఇంటి మనిషి అవుతుండటంతో ఆమె అభిమానులు, సినీ ప్రముఖులు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలుపుతున్నారు..