అభిజీత్‌కు సోహెల్ ప్రాంక్ కాల్ చేసి ‘బాలీవుడ్ సినిమా ఆఫర్ ఉంది’ చేస్తారా అంటూ మాట్లాడాడు. కాసేపు ఇద్దరూ మాట్లాడుకున్నాక సోహెల్ అసలు విషయం చెప్పేశాడు. దానికి అభిజీత్ చాలా కూల్‌గా రియాక్ట్ అయ్యాడు. దానికి మరోసారి సోహెల్, మెహబూబ్ ఫిదా అయిపోయారు. అభి కూల్‌నెస్‌కు బిగ్‌బాస్ హౌస్‌లోనే వీళ్లు ఫ్యాన్స్ అనుకోండి. ఈ క్రమంలో అభికి సోహెల్, మెహబూబ్ థ్యాంక్స్ చెబుతూ ఓ సెల్ఫీ అడిగారు. సోహెల్ అయితే అభిని షైనింగ్ స్టార్ అంటూ పొగిడేశాడు.