ప్రముఖ సినీనటుడు సోనూసూద్ పై ముంబై మున్సిపల్ కార్పొరేషన్(బీఎంసీ) పోలీసులకు ఫిర్యాదు చేసింది. ముంబై నగరంలోని తన నివాస గృహాన్ని హోటల్ గా మార్చినందుకు సోనూసూద్ పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు ముంబై పోలీసులకు ఫిర్యాదు చేశారు.