జేమ్ బాండ్ సిరీస్ నుంచి రూపొందిన తాజా చిత్రం ‘నో టైమ్ టు డై’. ఈ సినిమాను అక్టోబరు 8న విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం తాజాగా ప్రకటించింది. నిజానికి ఈ సినిమాను గతేడాది నవంబరు 20న విడుదల చేయాల్సింది. కానీ కరోనా కారణంగా కుదర్లేదు. ప్రస్తుతం థియేటర్లు తెరుచుకున్నా… ప్రజల నుంచి సరైన స్పందన లేకపోవడం, చాలా దేశాల్లో ఇంకా థియేటర్లు తెరుచుకోకపోవడంతో ఆ సినిమాను వాయిదా వేస్తూ వస్తున్నారు. ఆఖరికి అక్టోబరు 8ని ఎంచుకున్నారు. దీంతో ‘బాండ్ వర్సెస్ ఆర్ఆర్ఆర్’ అనే పోటీ ముందుకొచ్చింది.