రమ్యకృష్ణ 1985లో వచ్చిన "భలే మిత్రులు " చిత్రం ద్వారా కథానాయికగా తెలుగు చిత్రరంగ ప్రవేశం చేసింది. 1989లో వచ్చిన" సూత్రధారులు" చిత్రం ద్వారా మంచి నటిగా పేరు సంపాదించినప్పటికీ, ఈమెకి చాలా కాలం వరకు సినిమాల్లో అవకాశాలు రాలేదు. ఇక అంతేకాక రమ్యకృష్ణ ఏ సినిమాల్లో నటిస్తే, ఆ సినిమా ఖచ్చితంగా ఫ్లాప్ అవుతుందనే నమ్మకం కూడా చిత్రసీమలో ఉండేది. ఇక పోను పోను చిత్రసీమలో అందరూ ఐరన్ లెగ్ అని కూడా పిలిచేవారు. ఇక ఆ తర్వాత 1992లో విడుదలైన అల్లుడుగారు చిత్రం ఈమె అదృష్టాన్ని మలుపు తిప్పింది.