వైష్ణవ్ తేజ్ మాట్లాడుతూ.. విజయ్ సేతుపతితో స్క్రీన్ షేర్ చేసుకోవడం నిజంగా నా అదృష్టం. ఆయన ఆఫ్ స్క్రీన్ లో స్టార్ హోదాను ఏ మాత్రం చూపరు. చాలా ఫ్రెండ్లిగా ఉంటారు. ఎదురుపడిన ప్రతి మనిషిని గౌరవిస్తారు.ఆయన నుంచి నటనలోనే కాకుండా గుణంలో కూడా నేర్చుకోవాల్సింది చాలా ఉంది. ఉప్పెన షూటింగ్ చివరి రోజు ఆయన అందరిని పేరుపేరున పలకరించారు. సినిమాకు పని చేసిన యూనిట్ సబ్యులకు డిన్నర్ ఇవ్వడమే కాకుండా ఒక్కొక్కరికి వెయ్యి రూపాయలు కూడా ఇచ్చారు. అంత మంచి మనసున్న వ్యక్తి.. అంటూ వైష్ణవ్ తేజ్ వివరణ ఇచ్చాడు.