మలయాళంలో ఆకాశ దూతు కి రీమేక్ గా తెలుగులో మాతృదేవోభవ చిత్రాన్ని చిత్రీకరించారు. 1993 అక్టోబర్ 22న ఇలాంటి హడావిడి లేకుండా థియేటర్లలో విడుదలైన ఈ చిత్రానికి మొదటి కొద్ది రోజులు హాళ్ళు మొత్తం ఖాళీగా ఉన్నాయి. ఆ తరువాత ఉచితంగా కర్చీఫ్ లు ఇస్తామని ప్రకటించడంతో, పబ్లిక్ దీని కథేంటో చూద్దాం పదండి అంటూ థియేటర్లకు వెళ్లారు. ఇక అక్కడ సినిమా చూసిన మహిళలందరూ వారి కన్నీళ్లతో కర్చీఫులు తడిసి ముద్ద అయ్యేలా చేశారు. ఎవరూ ఊహించని విధంగా వందరోజుల సినిమా, శతదినోత్సవం కూడా జరుపుకుంది. ఈ చిత్రానికి ఎన్నో నంది అవార్డులు,జాతీయ అవార్డులు కూడా లభించాయి