బిగ్ బాస్ నాలుగో సీజన్లోకి కంటెస్టెంట్‌గా ఎంట్రీ ఇచ్చిన మోనాల్ గజ్జర్.. మొదట అభిజీత్‌తో క్లోజ్‌గా ఉంటూ వచ్చింది. అదే సమయంలో అఖిల్ సార్థక్‌తోనూ చనువుగా ఉండడం ప్రారంభించింది. దీంతో వీళ్ల మధ్య ట్రైయాంగిల్ లవ్ స్టోరీ నడుస్తున్నట్లు ప్రచారం జరిగింది. అలాంటి పరిస్థితుల్లో అభిజీత్‌ను పూర్తిగా దూరం పెట్టేసిన మోనాల్.. అఖిల్‌కు మాత్రం మరింత దగ్గరైపోయింది. షో మొదట్లో అభిజిత్ తో తెగ తిరిగేదు. వంద రోజుల పాటు జంటగా హల్చల్ చేసిన మోనాల్ గజ్జర్.. అఖిల్ సార్థక్.. బయటకు వచ్చిన తర్వాత కూడా అదే తీరుదతో వార్తల్లో నిలుస్తున్నారు. తరచూ కలవడం.. జంటగా పార్టీలు చేసుకోవడం వంటి వాటిని చేసుకోవడం చేస్తున్నారు.