సోషల్ మీడియాలో దుమ్ముదులుపుతున్న బ్రహ్మీ మీమ్స్ అన్నింటిని కలిపి.. ఓ అవేర్నెస్ వీడియోను రూపొంచారు.. హైదరాబాద్ పోలీసులు. జాబ్ పేరుతో ఆన్లైన్లో మోసపోవద్దు.. అనే కాన్సెప్ట్ తో బ్రహ్మీ టాప్ మోస్ట్ మీమ్స్‌ను అన్నింటినీ వాడి మరీ.. ఓ ఫన్నీ అవేర్నెస్ వీడియోను హైదరాబాద్ పోలీసులు రెడీ చేశారు. ఆ వీడియో లో ఆయన ఎక్స్ప్రెషన్ ను సందర్భాలకు అనుకూలంగా వాడుకున్నారు. . ఆ వీడియో పోలీస్ అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్లో.. పోస్ట్ చేశారు. ఇక ఈ వీడియో ఇప్పుడు అందరినీ ఎంటర్టైన్ చేస్తూ.. ఆలోచింప చేస్తూ.. సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది..