నాగ్ తో అరియనా సందడి మాములుగా చేయలేదు.. ఇటీవల అరియానా ఇప్పుడు నాగార్జునను వైల్డ్ డాగ్ కోసం స్పెషల్‌గా ఇంటర్వ్యూ చేసింది. నాగ్‌తో పాటు వైల్డ్ డాగ్ టీం కూడా ఈ ఇంటర్వ్యూలో పాల్గొంది. అయితే త్వరలోనే బయటకు రానున్న ఈ ఇంటర్వ్యూకు సంబంధించిన కొన్ని వీడియోలు, ఫోటోలు బయటకు వచ్చాయి.. ఆ ఇంటర్వ్యూ తర్వాత నాగార్జున తో ఈ బ్యూటీ తీసుకున్న ఫోటోలు సోషల్ మీడియా లో పోస్ట్ చేసింది.ఆ ఫోటోను తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేస్తూ.. మళ్లీ మంచి రోజు వచ్చింది.. నాకెంతో ఇష్టమైన నాగ్ సర్‌ను కలిశాను. వైల్డ్ డాగ్ ఏప్రిల్ 2న విడుదల కాబోతోందని చెప్పుకొచ్చింది.. మొత్తానికి ఈ అమ్మడు ఖాతాలో మరో రికార్డ్ నమోదు అయింది..