జగపతి బాబు హీరోగా ఆహాలో ఒక వెబ్ సిరీస్ చేయబోతుంది. ఇది చాలా హార్డ్ హిట్టింగ్ కాన్సెప్ట్ అని తెలుస్తుంది. ఇందులో చాలా బోల్డ్ క్యారెక్టర్లో ఆమని నటించబోతుంది. ఈ విషయాన్ని స్వయంగా తనే కన్ఫర్మ్ చేసింది. త్వరలోనే జగపతిబాబుతో ఒక వెబ్ సిరీస్ చేస్తున్నాను అంటూ చావు కబురు చల్లగా ప్రమోషన్ ఈవెంట్లో తెలిపింది. ఆమని ఒకప్పుడు హోమ్లీ క్యారెక్టర్స్‌తో ఆకట్టుకున్న ఈమెను ఇలాంటి బోల్డ్ పాత్రల్లో ప్రేక్షకులు ఎంత వరకు యాక్సెప్ట్ చేస్తారో చూడాలి.. ఇక చందమామ కథలు సినిమాలో సీనియర్ నరేష్‌తో లిప్ లాక్ సీన్ కూడా చేసింది ఆమని. కథ డిమాండ్ చేస్తే గ్లామర్ రోల్స్ చేయడంలో తప్పులేదు అది కేవలం నటనే అంటూ స్టేట్మెంట్ ఇచ్చేసింది..