రాజా' చిత్రం చిత్రం తమిళలో ఉన్ని డత్తిల్ ఎన్నై కొడుతైన్(కార్తీక్ ,రోజా) ఆధారంగా తెరకెక్కిన ఈ మూవీని ముప్పలనేని శివ తెరకెక్కించాడు. ఎస్. ఏ. రాజ్ కుమార్ స్వర సారథ్యంలో రూపొందించిన పాటలు ప్రత్యేక ప్రజాధారణ ను పొందాయి. అందులో ఈ సినిమాలోని 'ఏదో ఒక రాగం, పల్లవించు తొలిరాగమే, మల్లెల వాన'ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని పాటలు బాగా హిట్ టాక్ తెచ్చుకున్నవే.. అంతేకాకుండా ఇప్పటికీ ఇంకా ఈ పాటలు సంగీత ప్రియులను మురిపిస్తున్నాయి. అంతేకాకుండా రాజా చిత్రం అప్పట్లోనే 71 కేంద్రాలలో 100 రోజులు ఆడి రూ.15 కోట్ల మేరకు వసూలు చేసి రికార్డు సృష్టించింది సినిమా.