ఏప్రిల్ నెలలో మొదటగా థియేటర్లలో విడుదలైన చిత్రాలు వైల్డ్ డాగ్,సుల్తాన్ వంటి చిత్రాలకు పాజిటివ్ టాక్ వచ్చింది.కానీ ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా మిగిలిపోయాయి. తర్వాత వారం పవన్ కళ్యాణ్ నటించిన వకీల్ సాబ్ సినిమా విడుదలైంది. ఈ సినిమా కూడా సూపర్ హిట్ టాక్ ను సంపాదించుకుంది.కానీ చివరికి కరోనా ఎఫెక్ట్ పడడంతో ఈ చిత్రం కూడా కోలుకోలేకపోయింది. ఫైనల్ గా అబౌవ్ యావరేజ్ ఫలితం తో సరిపెట్టుకుంది. దీని తర్వాత విడుదలైన సినిమాలు శుక్ర, ఆర్జీవి దెయ్యం, టెంప్ట్ రాజా, కథానిక, ఒక అమ్మాయి క్రైమ్ స్టోరీ వంటి చిత్రాల జనాలను థియేటర్లకు రప్పించలేకపోయాయి.