అందరి స్టార్ హీరోలలాగే నాని కి కూడా బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వాలని ఆశగా ఉందట. కానీ అతను బాలీవుడ్ లోకి అడుగు పెట్టాలంటే ఒక సమస్య ఏర్పడిందని కూడా చెప్పుకొచ్చాడు.. ఆ సమస్య ఏదో కాదు, అతనికి హిందీ భాష రాకపోవడమే.. అయితే ఇది మాత్రమే కాదు, అతను బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాలంటే కొన్ని నిబంధనలను కూడా విధించుకున్నాడట. అంతేకాకుండా తనకు కథ నచ్చాలి. ఆ కథ కోసం తాను కొత్తగా తయారవ్వాలి. హిందీ భాషలో పట్టు సాధించాలన్న కోరిక బలంగా పాతుకుపోవాలి. ఇవన్నీ జరిగితేనే, బాలీవుడ్లో సినిమా చేస్తానంటున్నాడు నాని.