ఒకానొక సమయంలో సునీల్ ఒక నాలుగు పెద్ద హీరోల సినిమాలను కూడా వదిలేశాడు అంటూ వార్తలు వచ్చాయి. హీరోగా సునీల్ కెరియర్ కొంతకాలం బాగున్నప్పటికీ, ఆ తర్వాత కథ మొత్తం తలకిందులైంది. హీరో గా ఆఫర్లు రాకపోవడంతో మళ్ళీ కమెడియన్ గా చేసేందుకు సిద్ధమయ్యాడు.ఇప్పుడు వరుసగా హీరోగా చేస్తూనే మరో వైపు కమెడియన్ గా కూడా నటిస్తున్నాడు. సునీల్ తన కెరియర్లో ఇప్పుడు మంచి నిర్ణయం తీసుకుంటున్నాడు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇప్పట్లో ఒకవైపు హీరోగా, మరో వైపు కమెడియన్ గా, ఇంకొక వైపు విలన్ గా, సినీ అవకాశాలు చాలా వస్తున్నాయి. చాలా సంవత్సరాల తర్వాత ఇప్పుడు మంచి నిర్ణయం తీసుకుంటున్నాడు అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు అంటున్నారు..