కీర్తి రెడ్డి ఇంట్లో విషాదం నెలకొంది. ఈ రోజు ఉదయం ఆమె తండ్రి స్వర్గస్తులయ్యారు..కీర్తి రెడ్డి తండ్రి ఎవరో కాదు టిఆర్ఎస్ నాయకులు. నిజామాబాద్ కు చెందిన టిఆర్ఎస్ నాయకుడు కేశ్ పల్లి (గడ్డం) ఆనందరెడ్డి. ఆయన వయస్సు 60 సంవత్సరాలు. ఆనంద్ రెడ్డి . ఈరోజు( మే 14)( శుక్రవారం) తెల్లవారుజామున గుండెపోటుతో కన్నుమూశారు. హైదరాబాద్ లోని తన నివాసంలో ఆనంద్ రెడ్డికి గుండెపోటు రావడంతో , ఆయన కుటుంబ సభ్యులు వెంటనే ఒక ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో ఆసుపత్రిలోనే చికిత్స పొందుతూ ఆనంద్ రెడ్డి కన్నుమూశారు..