వరుస ఫ్లాపులతో రామ్ చరణ్ కొట్టుమిట్టాడు. ఫ్లాపులతో నీరసించిపోయిన రామ్ చరణ్ ఇప్పుడు ఎలాగైనా సరే హిట్ కొట్టాలనే ఆలోచనతో అప్పటివరకు విభేదాల్లో మునిగిపోయి ఉన్న శ్రీను వైట్ల, కోన వెంకట్ , గోపి మోహన్ ఈ ముగ్గురిని కలిపి 2015లో బ్రూస్ లీ చిత్రాన్ని తెరకెక్కించారు. 2015 అక్టోబరు 16 శుక్రవారం నాడు భారీ అంచనాల మధ్య ఈ చిత్రం విడుదలైంది. రాం చరణ్ , రకుల్ ప్రీత్ సింగ్ ప్రధాన పాత్రల్లో నటించారు.ఈ సినిమాకు రూ.50కోట్ల బడ్జెట్ పెట్టగా, ఇక రూ.65 కోట్లకు అమ్మారు. ఇక వచ్చిన కలెక్షన్స్ పరంగా చూసుకుంటే కేవలం రూ.40 కోట్ల రూపాయల వసూళ్లు మాత్రమే రాబట్టింది. ఇక మొత్తం 25 కోట్ల రూపాయలు లాస్ తో డిజాస్టర్ గా నిలిచింది ఈ చిత్రం.. రామ్ చరణ్ ఎంతో ఆశ పడి , చివరికి డిజాస్టర్ ను చవిచూశాడు..