ఆ తర్వాత 2000 సంవత్సరంలో నువ్వే కావాలి చిత్రం ద్వారా కథానాయకుడిగా సినీ రంగ ప్రవేశం చేశాడు. అంతేకాకుండా ఈ చిత్రం ద్వారా ఉత్తమ నటుడుగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈ చిత్రాన్ని ఉషాకిరణ్ మూవీస్ పతాకంపై రామోజీరావు నిర్మించగా, స్రవంతి రవి కిషోర్ ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రంలో రిచా కూడా హీరోయిన్ గా తొలి పరిచయం అయింది. ఇక మొదటి రోజే మంచి హిట్ టాక్ ను అందుకున్న ఈ చిత్రం, హిందీలో "తుజే మేరీ కసం" అనే పేరుతో రీమేక్ చేయబడింది. ఇక అక్టోబర్ 13 2000 సంవత్సరంలో విడుదలైన ఈ చిత్రం, బాక్సాఫీసు వద్ద భారీ విజయాన్ని అందుకుంది.ఇక ఈ చిత్రం ద్వారా ఫిలింఫేర్ ఉత్తమ నూతన తెలుగు నటుడిగా తరుణ్ అవార్డును అందుకున్నాడు. ఉత్తమ జాతీయ తెలుగు చిత్రంగా పురస్కారం కూడా అందుకుంది ఈ చిత్రం. అంతేకాకుండా ఉత్తమ దర్శకుడు అవార్డు, ఉత్తమ తెలుగు నటి అవార్డులను కూడా ఈ చిత్రం అందించింది..