అవును, ఈ ముగ్గురూ కలసి ఓ చిత్రంలో నటించే అవకాశం ఉంది. ఒకప్పుడు ఈ ముగ్గరితో ‘పదునారు వయదినిలే’ చిత్రాన్ని తెరకెక్కించారు భారతీ రాజా. ఆ చిత్రంలో శ్రీదేవి, కమల్ హాసన్, రజనీకాంత్ నటించారు. ఆరోజుల్లో ఆ సినిమా ఎంత సంచలనమో అందరికీ వేరే చెప్పనక్కర్లేదు. అయితే... అదే కాంబినేషన్ లో మరో చిత్రాన్ని ఇప్పుడు తీయాలనే ప్రయత్నంలో ఉన్నారు భారతీరాజా. ఇప్పటికే ఈ ముగ్గురు తారలను భారతీరాజా వేర్వేరుగా కలసి చర్చించారని సమాచారం. ముగ్గురికీ సరిపడా ఒక కథను కూడా ఆయన సిద్ధం చేసుకున్నారు. ఈ ముగ్గురూ ఓకే అంటే ఇదో సంచనలమే అవుతుంది.
మరింత సమాచారం తెలుసుకోండి: