మెగాస్టార్ చిరంజీవి తమ్ముడుగా సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన పవన్ కళ్యాన్..మొదట్లో ఎన్నో ఆటుపోట్లను ఎదురు చూశారు. ఇంట్రడక్షన్ సినిమా పెద్దగా విజయం సాధించకపోవడం..అన్నయ్యను అనుకరిస్తున్నారంటూ కామెంట్లు రావడం..తర్వాత వచ్చిన సినిమాలు పెద్దగా విజయం సాధించకపోవడం లాంటివి పవన్ ని బాగా ఇబ్బందులకు గురిచేశాయి. తర్వాత తమ్ముడు, బద్రి, జల్సా,గబ్బర్ సింగ్ లాంటి చిత్రాలు పవన్ కెరీర్ ని ఒక్కసారిగా పైకి లేపాయి..ఇక అత్తారింటికి దారేది చిత్రం అయితే తెలుగు ఇండస్ట్రీలో నెంబర్ వన్ రేసులోకి తీసుకెళ్లాయి. ఇక పవన్ వ్యక్తి గత విషయాల్లో కొన్ని ఎత్తు పల్లాలు ఉన్నాయి...ఇండస్ట్రీలో పెద్దగా గుర్తింపు లేని టైమ్ లో మొదటి వివాహం జరిగింది..కానీ ఇద్దరి మద్య అభిప్రాయ బేధాలు రావడం విడాకులు తీసుకోవడం జరిగింది.

పవన్ కళ్యాన్ మొదటి పెళ్లి, రెండవ పెళ్లి రేణు దేశాయ్,పిల్లలు


తర్వాత బద్రి చిత్రంలో తన సహనటి రేణు దేశాయ్ తో ప్రేమలో పడటం పెద్దల సమక్షంలో వివాహం చేసుకోవడం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లు కూడా పుట్టారు..కానీ మరోసారి అభిప్రాయ బేధాలతో ఈ జంట విడాకులు తీసుకున్నారు. కానీ ఇప్పటి వరకు రేణు దేశాయ్, పిల్లలతో రిలేషన్ కంటిన్యూ చేస్తున్నాడు. ‘తీన్మార్’ సినిమా సమయంలో రష్యన్ యువతి అన్నా లెజ్నోవాతో ప్రేమలో పడి పవన్ ఆమెను రహస్య వివాహం చేసుకున్న విషయం తెలిసిందే.. వీరికి ఓ పాప కూడా ఉంది. ఈ మద్య చిరంజీవి చిన్న కూతురు శ్రీజ పెళ్లిలో పవన్ సతీమణి అన్నా లెజ్నోవా.. శ్రీజ పెళ్లి వేడుకల్లో చురుగ్గా పాల్గొన్నట్లు తెలుస్తుంది. అన్నాకు సంబంధించిన కొన్ని ఫొటోలు తాజాగా బయటకొచ్చాయి.

పవన్ మూడవ భార్య అన్నా లేజ్ నోవా


ఇక పవన్ కళ్యాన్ సర్ధార్ గబ్బర్ సింగ్ చిత్రం ఉగాది పర్వదినం రోజున విడుదలైన విషయం తెలిసిందే..ఈ చిత్రం మిశ్రమ స్పందన వచ్చింది. అయితే పవన్ కు బాలీవుడ్ లో మొదటి సినిమా ఈ నేపధ్యంలో పవన్ వరుస పెట్టి బాలీవుడ్ మీడియాకు ఇంటర్ వ్యూ లు ఇస్తున్నాడు. ఇలా ఇచ్చిన ఓ ఇంటర్ వ్యూ లో పవన్ తన వ్యక్తిగత విషయాల గురించి స్పందించాడు. ఈ సందర్భంగా మీరు బ్యాచ్ లర్ గా ఉండాలనుకున్నారు..కదా మరి మూడు పెళ్లిళ్లు ఎలా..? అన్న ప్రశ్నకు పవన్ సమాధానం ఇస్తూ నిజంగా ఈ విషయంలో మా అమ్మకూడా ఆశ్చర్యపోయింది..అసలు నేను పెళ్లి చేసుకోకుండా హిమాలయాలకు వెళ్లి తపస్సు చేసుకోవాలనుకున్నా అలాంటిది మూడు పెళ్లిల్లు ఎలా చేసుకున్నానో నాకే అర్ధం కావడం లేదు. లా నా విషయంలో జరిగింది అంత నాకే ఆశ్చర్యం కలిగిస్తోందని అన్నాడు.


మరింత సమాచారం తెలుసుకోండి: