
నాచురల్ స్టార్ నాని త్వరలో మజ్ఞుగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. లాస్ట్ ఇయర్ నుండి వరుస హిట్లతో కెరియర్ జోష్ లో ఉన్న నాని ఇప్పుడు తన అసలు టాలెంట్ రాబోతున్న హిట్ తో తేల్చుకోబోతున్నాడు. ప్రతి సినిమాకు ఏదో ఒక హిట్ సెంటిమెంట్ ఫాలో అయ్యే నాని మజ్ఞును కొత్తగా ప్లాన్ చేశాడు. అయితే ఈ ఇయర్ ఇప్పటికే రెండు సినిమాల హిట్లతో దూసుకెళ్తున్న నాని మజ్ఞు హిట్ చాలా కీలకంగా మారింది.
తన ప్రతి సినిమా తనకు ఓ పరిక్షే అనుకుంటున్న నాని ఉయ్యాల జంపాల లాంటి ఓ చిన్న సినిమా దర్శకుడి మీద నమ్మకంతో మజ్ఞు సినిమా చేశాడు. అయితే కథ కథనాలు ఎంత కొత్తగా ఉన్నా నాని రేంజ్ హిట్ అందుకోవాలంటే ఈసారి కాస్త కష్టపడాల్సిందే. కృష్ణగాడి వీర ప్రేమగాథ ఓ లవ్ సబ్జెక్ట్ కాని కొత్తగా ట్రై చేశాడు హను.. ఇక జెంటిల్ మన్ ఓ థ్రిల్లింగ్ స్టోరీ.. మజ్ఞు మాత్రం ప్రేమ కథ.
సినిమా ట్రైలర్ చూస్తుంటే కచ్చితంగా విషయమున్నదనే అనిపిస్తుంది. విరించి వర్మ డైరెక్ట్ చేసిన ఈ సినిమా జెమిని కిరణ్ నిర్మించడం జరిగింది. అయితే ఈ సంవత్సరం రిలీజ్ అయిన ముందు రెండు సినిమాలు కాదు ఈ సినిమా హిట్ కొడితే నాని అసలు స్టామినా ఏంటో తెలుస్తుంది. ఎందుకంటే భలే భలే మగాడివోయ్ సినిమా నానికి 25 కోట్ల షేర్ వాల్యూ తెచ్చి పెట్టింది. అయితే తర్వాత రిలీజ్ అయిన కృష్ణగాడు కేవలం 10 కోట్లే కలెక్ట్ చేసింది.