సినీ పరిశ్రమలో మొదట కమీడియన్ గా నటిస్తూ రాను రాను తన నైపుణ్యాలను ఇంకా మెరుగు పరుచుకొని ప్రస్తుతం హీరో గా రాణించిన యాక్టర్ ఎవరంటే టక్కున వచ్చే సమాధానమే సునీల్. తక్కువ సమయంలో సినీ పరిశ్రమలో నిలదొక్కుకున్న వ్యక్తి కూడా ఈయనే. అలాంటి హీరో ఒక కొత్త కార్ తీసుకున్నాడు. ముసారాంబాగ్‌లోని మలక్‌పేట ఈస్ట్‌జోన్‌ ఆర్టీఏ కార్యాలయంలో తన కొత్త కారు రిజిస్ట్రేషన్‌ చేయించుకోడానికి సోమవారం సినీ హీరో సునీల్‌ వచ్చారు.



సెలబ్రిటీలు తమకు ఇష్టమైన లేదా కలిసొచ్చే నంబరు కోసం ఎంత మొత్తమైనా సరే, చెల్లించి ఆ నంబరును సొంతం చేసుకుంటూ ఉంటారు. ఈ క్రమంలో ప్రముఖ నటుడు సునీల్ తన కారుకు ఫ్యాన్సీ నెంబర్ ను దక్కించుకున్నాడు. రూ. 40 లక్షల విలువ చేసే తన స్కోడా  లూరిస్ వాహనం రిజిస్ట్రేషన్ కోసం మలక్ పేటలోని ఆర్టీఏ కార్యాలయానికి సునీల్ నిన్న వెళ్లాడు.



విషయాన్ని మలక్‌పేట ఈస్ట్‌జోన్‌ ఆర్టీఏ కార్యాలయంలోని ఎంవీఐలు నాగరాజు, టి.వెంకటేశ్వర్‌రావుకు సమాచారం ఇవ్వగా వారంతా దగ్గరుండి రిజిస్ట్రేషన్‌ చేయించారు. రూ.31.73లక్షల విలువ చేసే తెలుపురంగు స్కోడా లారిన్‌ కారుకు టీఎస్‌11ఈజే 2345 నంబరును అధికారికంగా కేటాయించారు. టీఎస్11ఇజే2345 నెంబరు కోసం పదివేల రూపాయల విలువ చేసే డీడీని సునీల్ తమకు ఇచ్చాడని కార్యాలయ వర్గాలు పేర్కొన్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: