దేశంలో ట్రెండ్ మారుతోందా. ఓటర్ల ఆలోచనలో మార్పు కనిపిస్తోందా? ఎందుకొచ్చిన ఓటింగ్ అన్న నిర్వేదం నిరాశ జనాల్లో ఎక్కువ అయిందా అంటే గత రెండు విడతలుగా జరిగిన పోలింగ్ సరళిని చూస్తే ఇదే నిజం అనిపిస్తోంది. అంటే బలమైన నాయకుడు ప్రజాకర్షణ నేత మరోసారి దేశానికి ప్రధాని కావాలని బీజేపీ నేతలు ఎంత ఆర్భాటపు ప్రకటనలు చేస్తున్నా.. జనాలకు మోదీ విషయంలో పాజిటివ్ వైబ్రేషన్స్ కనిపించడం లేదు.


ఒకవేళ ఉంటే ఇంత నీరసంగా పోలింగ్ సాగడం ఏంటనే రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఈ సరిళిని చూస్తే బీజీపీ పట్ల జనాలకు పూర్తి స్థాయిలో అనుకూలత కనిపించడం లేదని కూడా విశ్లేషిస్తున్నారు. అదే కనుక ఉంటే 2019 మాదిరి వెల్లువలా జనాలు పోలింగ్ బూత్ ల దగ్గరికి తరలి వచ్చేవారని అంటున్నారు. మొదటి విడత చూసి షాక్ తింటే.. రెండో విడత జరిగిన పోలింగ్ శాతం చూస్తే ఇంకా నిరాశ పడాల్సి వస్తోంది.


ఏది ఎలా ఉన్నా ప్రధాని మోదీ మాత్రం తన ఎక్స్ ఖాతాలో ఓటింగ్ కు వచ్చిన ఓటర్లందరికీ కృతజ్ఞతలు తెలిపారు. అంతే కాదు యూత్ మహిళలు అంతా ఎన్డీయేకి మద్దతు తెలిపారు అంటూ కితాబిచ్చారు. ఇక పోలింగ్ సరళికి వస్తే తగ్గిన విధానం చూస్తే బీజేపీకి మైనస్ పాయింట్ అని అంటున్నారు. ఉత్తర భారత దేశంలో బీజేపీకి మంచి పట్టుంది. స్వయంగా కాషాయ జెండాలను పోలింగ్ బూత్ ల దగ్గరకి తీసుకవచ్చి హోరెత్తిస్తారు.


కానీ ఈసారి బీజేపీకి పట్టున్న చోటే పోలింగ్ తగ్గడం గమనార్హం. దీంతో బీజేపీకి, మోదీకి టెన్షన్ పట్టుకుంది. ప్రస్తుతం తగ్గిన పోలింగ్ శాతాన్ని గమనిస్తే ఓటర్లు కచ్చితంగా నిరాశలో ఉన్నారని అర్థం అవుతుంది. అధికార పార్టీ పట్ల సంతృప్తిగా లేరన్న వాదనలు వినిపిస్తున్నాయి. మొత్తం మీద ప్రస్తుతం జరిగిన పోలింగ్ కాషాయ దళాన్ని కలవరపాటుకి గురి చేస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: