చెప్పను బ్రదర్’ అన్న మాటలు ఏక్షణాన అల్లు అర్జున్ అన్నాడో తెలియదు కానీ అప్పటి నుంచి పవన్ అభిమానులకు శత్రువుగా మారిపోయాడు బన్నీ. ఆ తరువాత పవన్ అభిమానుల కోపం తగ్గిద్దామని బన్నీ ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ ప్రయత్నాలు కలిసి రావడంలేదు.

ఈ పరిస్థుతులలో వచ్చేనెల విడుదల కాబోతున్న ‘దువ్వాడ జగన్నాథం’  మ్యూజిక్ రిలీజ్ కు రంగం సిద్ధమవుతోంది అని తెలియచేసే లేటెస్ట్ టీజర్ ను కూడ పవన్ అభిమానులు చాల గట్టిగా విమర్శలతో టార్గెట్ చేస్తున్నారు. ఇందులో అల్లు అర్జున్ ను పంచెకట్టులో అది కూడా వెనకనుంచి మాత్రమే చూపించారు. 

అంతేకాదు ఎప్పుడు లేని విధంగా బన్నీ చేత సింపుల్ స్టెప్స్ వేయించారు. 22 సెకన్ల పాటు ఉన్న టీజర్ లో వినిపించిన దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన బీట్ బన్నీ అభిమానులకు జోష్ ను ఇస్తూ ఉంటే పవన్ కళ్యాణ్ లుంగీ డాన్స్ ను అల్లుఅర్జున్ కాపీ కొట్టాడు అంటూ పవన్ అభిమానులు సెటైర్లు వేస్తున్నారు. 

దీనితో మళ్ళీ బన్నీ పవన్ అభిమానుల మధ్య సోషల్ మీడియా వార్ మొదలైంది. ట్విట్టర్, ఫేస్ బుక్, యూట్యూబ్ అనే తేడాలేకుండా అల్లు అర్జున్, పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఒకరి పై ఒకరు సెటైర్లు వేసుకుంటున్నారు. 

డీజే ఆడియో రిలీజ్ టీజర్ విడుదలై ఇంకా 24 గంటలైనా గడవకుండానే దానిని టార్గెట్ చేస్తూ ఇప్పటికే ఈ టీజర్ కు 10 వేలకు పైగా డిస్ లైక్స్ వచ్చాయి అంటే ఈ మూవీ పట్ల పవన్ అభిమానులు ఎంత కోపాన్ని పెంచుకున్నారో అర్ధం అవుతుంది. జూన్ నెలాఖరున విడుదల కాబోతున్న ఈసినిమా మరొక బ్లాక్ బస్తర్ హిట్ ను అందిస్తుంది అని బన్నీ అభిమానులు ఆసపడుతూ ఉంటే పవన్ అభిమానులు మాత్రం ఈ మూవీలోని నెగిటివ్ పాయింట్లు వెతుకుతూ అప్పుడే హడావిడి మొదలు పెట్టేసారు.. 


మరింత సమాచారం తెలుసుకోండి: