బాలీవుడ్ లో నిర్మిస్తున్న క్రైమ్  ధ్రిల్లర్ సినిమా ‘కిల్ ద రేపిస్ట్’ సినిమా కోసం ఆ సినిమా దర్శకుడు సంజయ్ చెహల్ కు రేపిస్ట్ కేరెక్టర్ చేసే నటులకోసం వెతుక్కోవలసిన పరిస్థితి ఏర్పడిందట. ఢిల్లీ లో జరిగిన నిర్భయ సంఘటన నేపధ్యంలో ఈ సినిమాను తీస్తున్నారు. ఈ సినిమాలో రేపిస్ట్ పాత్ర పోషించే నటుడుని ఎంపిక చేయడం ఈ సినిమా దర్శకుడుకి తలనొప్పిగా మారిందట.

ఈ పాత్రకోసం ఒక కొత్త నటుడుని ఎంపిక చేద్దామని ఏకంగా 400 మందికి ఆడిషన్స్ నిర్వహిస్తే కానీ ఒక నటుడు దొరకలేదట. పూనా ఫిలిమ్ ఇన్స్టిట్యూట్ లో యాక్టింగ్ నేర్చుకుంటున్న విధ్యార్ది సన్నీ రూపంలో వీరికి నచ్చిన రేపిస్ట్ పాత్రకు నటుడు దొరికాడట. మరొక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ ఆడిషన్స్ కు వచ్చిన చాలామంది నటులు నిర్భయ ను రేప్ చేసే పాత్రను పోషించడానికి ఇష్టపడ లేదట.

దీనితో ఈ సినిమాలోని రేపిస్ట్ పాత్రకోసం ఈ సినిమా దర్శకుడు నాలుగు నెలలు అన్వేషిస్తే కాని నూతన నటుడు సన్నీ దొరకలేదట. అంజలి పాటిల్ ప్రధాన పాత్ర పోషిస్తున్న ఈసినిమా త్వరలోనే సెట్స్ పైకి వస్తుందని తెలుస్తోంది....

మరింత సమాచారం తెలుసుకోండి: